మరువం ఉష తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

మరువం;మరువం ఉష

నెనరులు

15 April 2024 6:29 AM

మరువం;మరువం ఉష

బాగున్నాయండి.

15 April 2024 6:29 AM

మరువం;మరువం ఉష

జిలేబీ గారు, నెనర్లు. నేను సరదాగా మా అమ్మాయి చేత చదివించటానికి వ్రాసాను (ఏ భాషా నియమాలు పాటించకుండా). మీరు తప్పక ఛందస్సు ననుసరించి వ్రాసి ఉంటారు.

06 May 2023 7:01 AM

మరువం;మరువం ఉష

చాలా సంతోషమండి. నా అక్షరాలని పట్టించుకుని, ఒకరు పదిలపరిచారన్న ఊహకి కంటనీరు వచ్చింది. ఇంకా గోమ్తుపూడిన భావనే నా వేళ్ళలోనూ...చూస్తాను నేనే కొన్నిటిని వెనక్కి లాగానా?

12 October 2019 7:34 AM

మరువం;మరువం ఉష

జిలేబీ గారు! నెనర్లు. చిటికెలో యే వచన్నాన్ని అయినా పద్య రూపానికి మార్చగలరు సుమీ

13 August 2017 7:05 PM

" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార;మరువం ఉష

"కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది" అని శ్రీశ్రీ నినదించాక సాహిత్యమే ఖడ్గమని, ఆ సృజననే ఖడ్గసృష్టి అని భావించాలనే శేషేంద్రుల మనోగతం కావచ్చు! ఆనాటి కవులలో సద్విమర్శ, వైరుధ్యాల నడుమ ఘర్షణ సున్నితంగా సునిశితంగా వెలికి వచ్చేవి కదా!?

06 May 2016 4:11 AM

" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార;మరువం ఉష

నేనేనండి, అచ్చెరువుతో వెలికి వచ్చిన ఆదరణకి కృతజ్ఞతలు...

06 May 2016 4:03 AM

" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార;మరువం ఉష

మీ బ్లాగులో చదవక మిగిలిన బాకీ (2011 చివరి నెలల మీదుగా) దాదాపుగా పూర్తి అయింది. ఇవేళ్టికి మంచి పద్యం తో మనసు నిండింది.

06 May 2016 3:57 AM

64 కళలు డాట్కాం;మరువం ఉష

ముందుగా ఈ వ్యాసానికి ధన్యవాదాలు. http://www.cpbrownacademy.org/telugu_jaathi_ratnalu.asp జాబితాలో నాకు 'వ.పా. జీవితచరిత్ర' కనపళ్ళేదు. అకాడెమీ వారికీ ఈమెయిల్ ఇచ్చాను. మీరూ సుంకర చలపతి రావు గారిని సంప్రదిస్తారని ఈ వ్యాఖ్య. థాంక్స్!

13 September 2014 3:24 AM

చిన్నిగుండె చప్పుళ్లు;మరువం ఉష

మాట మీద మాటగా బాగా చెప్పారండి. ఇలాగే మునుపు మాట మీద చదివిన అనేక రచనల్లోవి ఓ నాలుగు పంచాలనిపించి:

మాట గురించి విశ్వనాథ వారి మాట – “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది మనము.”

"తనువున విఱిగిన యలుఁగుల
ననువునఁ బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్‌
మనమున నాటిన మాటల
వినుమెన్ని యుపాయముల వెడలునె యధిపా!" - తిక్కన

శరీరంలో బాణాల ములుకులు గుచ్చుకుంటే ఏదో ఉపాయంతో
తీసేయవచ్చు. కాని పరుషంగా మనసులో గుచ్చుకున్న మాటలను తొలగించలేము అని దీని భావం.

"Don’t mix bad words with your bad mood. You’ll have many opportunities to change your mood, but you’ll never get the opportunity to replace the words you spoke….." - Jerose

“Life's disappointments are harder to take when you don't know any swear words.” - Bill Watterson

Both are equally true though...

22 May 2014 9:49 PM

కెలైడోస్కోప్;మరువం ఉష

గిరీష్ గారు, మీది పాత పోస్ట్ అయినా, ఆ కడిమి అన్న మాటకి వివరణ తెలుసుకోవాలనే ఆసక్తి ఉందనుకుంటూ:

'కడిమి' అన్నది చాలా పెద్ద - దాదాపుగా బాదం మాదిరి- ఆకులతో, చాలా అందమైన పూలతో ఉండే చెట్టు అండి. దీన్నే మా ఊర్లలో కదంబం అంటారు. చాలా ఎత్తుగా నిలిచి ఉంటుంది దాదాపు గా 40-50 అడుగులు ఉండొచ్చు. ఏడాది పొడుగునా అలా పచ్చగా ఎత్తుగా నిలబడి ఉండటం వలన వేటూరి గారి పాటలో ప్రతీక ఈ చెట్టేనేమో!?

నేను తాకి చూసిన పుష్పాన్ని ఇక్కడ ఉంచాను https://plus.google.com/u/0/photos/112283300174396077528/albums/5950579197712477377/5950579202236591458

ఇంకాస్త ఇక్కడ: http://en.wikipedia.org/wiki/Neolamarckia_cadamba

26 November 2013 8:55 PM

క ళా స్పూ ర్తి;మరువం ఉష

పృధ్వీ, ఎంత ఆనందంగా ఉందో తిరిగి కదిలిన మీ కుంచె వైనాలు చూస్తుంటే. మీ చిత్రాలకి నా కవితలు, నా కవితలకి మీ ప్రతి కవితల నాటి స్మృతులు ఊపుతున్నాయి. మీరిలాగే మీ కళలో జ్ఞానోదయాన్ని, సత్యావిష్కరణని అనుభవం లోకి తెచ్చుకోవాలి. నిత్యం మీ ప్రశాంత మానస/జీవన సౌరభాన్ని ఆకాంక్షిస్తూ...

11 October 2012 7:51 AM

కమ్మటి కలలు;మరువం ఉష

మీ కమ్మటి కలలు/గురుతులు చాల్చాలా వెనక్కి వెళ్ళినా - పాటలు మాత్రం నిన్నా మొన్నా వింటున్నవే. ;) నాకు ఆ 'చికిలింత...', 'ఎందాకా...' చాలా ఇష్టం. మొత్తంగా ఈ చిత్రం లో నాకు 5 తెలుసునని ఇపుడే తెలుసుకున్నాను, ఇందాకా ఘంటసాల గారి ఆణిముత్యాల్లో విడివిడిగా విన్నాను మరి!

23 May 2012 5:06 PM

రేణుక అయోల;మరువం ఉష

recapturing and projecting the past in an enchanting way is the prime function of writing... అన్నది ఋజువు చేసారు. నిజమే కదా "అవిటి వాళ్ళతోనిండిన
నగరంలో మనం ఒకరం...." అనుభూతించలేని వైకల్యం మనసుకి సోకనివారు అతి కొద్దిమందే. సుందర ప్రపంచాన అంధులే ఎక్కువ. కాకపోతే, నా వరకు ఆ వసంతపు పాఠమిది 'జీవితం అలా నిత్య వసంతం కనుకనే ఇంకా ఏవో శుభఘడియలు రానున్నాయన్న ఆశ ముందుకు నడిపిస్తుంది, While I can recapture my past in words, and re-live in it to my heart's content'

కవితలో అంశం బావుంది.

23 May 2012 5:00 PM

మోహనమీ ప్రకృతి;మరువం ఉష

ఊ అవునండి, అప్పట్లో ఈ బిళ్ళగన్నేరు, చంద్రకాంతలు, కనకాంబరం, నిత్యమల్లి లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. నా మొక్క కాస్త ముదురురంగు పూలు పూస్తుంది, కానీ ఈ రంగూ దొరుకుతుంది (https://picasaweb.google.com/112283300174396077528/MyGarden#5744973687442026466) మాకు ప్రతి శీతాకాలం దాదాపుగా మొక్కలన్నీ పోతాయి. తిరిగి నాటాలి మరుసటి ఏటికి.

21 May 2012 10:23 PM

బాల కళ;మరువం ఉష

చిన్నారి సాన్వి కి అభినందనలు. తనలోని కళని వదలకండా సాధన చేసేలా తన పెద్దలు కృషి పెడతారని అనుకుంటున్నాను. 4/25 పోస్ట్ లో బొమ్మ కూడా ఈ చిన్నారి చెయ్యి పనే కదండీ? మీ బాలకళ బ్లాగు నేను చూస్తుంటానెపుడూను. మీ ప్రయత్నం హర్షించదగినది.

27 April 2012 8:31 AM

మోహనమీ ప్రకృతి;మరువం ఉష

తులసమ్మ తో పాటుగా, మిగిలిన మూడు వైపులా మరువం, దవనం, మాచీపత్రి పేర్చితే మరింత బావుండేది.

12 April 2012 5:37 AM

విశ్వనాథుని కౌటిల్యుడు;మరువం ఉష

ఈ విశ్వనాథ వారి ఊసుతో సంబంధం లేదు గానీ, కౌటిల్య - మీరు గుర్తొచ్చారు "http://puranapandaphani.wordpress.com/2012/03/04/%E0%B0%B2%E0%B1%87%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%B8%E0%B0%82-%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8/' చదివినపుడు. మీ దగ్గర వివరణ దొరకొచ్చేమో అనుకున్నాను.

10 March 2012 9:50 PM

భావనాంతరంగం;మరువం ఉష

జ్యోతి, మాలా గారు, జయా - మాటలు చెప్పలేని హాయిని కలిగించినందుకు చాలా థాంక్స్. జయా! భలే చెప్తారు ఉండుండి భావాలని భద్రంగా! భావనాంతరంగం మీ మాటల్లో మరింత చిక్కగా కనిపిస్తోంది.

ఆత్మబంధువు విజయమోహన్ గారు - ఆశించని ఆశీస్సులతో ఆనందం చల్లినందుకు ధన్యవాదాలు.

05 March 2012 10:21 AM

భావనాంతరంగం;మరువం ఉష

నడిచిపోతున్న గతం
వదిలివెళ్ళిన నమ్మకం,
రాలిపడిన కుసుమం
గుర్తుకు తెచ్చే మకరందం
... భావన, ఆనందం పట్టలేక మంచు వానలో తడిసిన కనులో, ఆనందాతిశయంతో నానిన చూపో - నా కన్నుకి వేళ్ళకీ ఇంకా సఖ్యత రాలేదు. ఎన్నాళ్ళకి నీ కలం కదపగలిగాను! చిత్రంగా నెలకోమారు నీ బ్లాగులో మానియాదతో కలదిరిగే నాకు ఇవాళ మరొకరు తెలిపే వరకూ ఈ మాట
తెలియలేదేమే?

సం. క్రితం పాతేసిన 2సం. నాటి గాయపు చిహ్నం గతావలోకనలో గుర్తుకు తెచ్చుకోలేక తప్పలేదు. విలవిల్లాడుతూ ఒరిగిన మనసుని ఒడిసిపట్టిన నీ స్నేహం నేనూ మరవను. నా వనం తో సమంగా స్తబ్దమైన నీ గానమూ మరవను. నలుగురిలో నన్ను ఇంతగా పొగిడావని నేనున్నా మాట చెప్పక తప్పలేదు. నాతో పొగిలి, నన్ను పొదుపుకున్న మరొక మనసు సం. క్రితం పుంతలు తొక్కింది. మిగిలిన నీ మనసు ఇన్నాళ్ళకి కరిగింది. ఈ కానుక చాలు. కదిలిన ఈ అక్షరగీతి కలకాలం సుస్వరవాణిగా అమరగానమై అలరారాలి. ఈ స్నేహపుబంధం సుమగంధాలు వెదజల్లాలి. థాంక్యూరా బిడ్డీ!

05 March 2012 10:18 AM